కామారెడ్డి ప్రజావాణిలో118 ఫిర్యాదులు : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్

 కామారెడ్డి ప్రజావాణిలో118 ఫిర్యాదులు : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు:  కామారెడ్డి కలెక్టరేట్‌లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 118  ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​,  అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్​రెడ్డి, విక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు.  ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్​ ఆదేశించారు.   ఆర్డీవో రంగనాథ్​రావు, జడ్పీ సీఈవో చందర్​ ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకలు ఘనంగా ​ నిర్వహించాలి

ఈ నెల 26న గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆయా శాఖల జిల్లా అధికారులకు ఆదేశించారు.  స్టేజీ ఏర్పాటు, ముఖ్య అతిథి ప్రసంగం,  సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు,  తదితర కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు.  అడిషనల్​ కలెక్టర్లు విక్టర్​, శ్రీనివాస్​రెడ్డి ఇతర అధికారులు 
పాల్గొన్నారు.